నొప్పితోనే షూటింగ్‌ చేసిన అమితాబ్ బ‌చ్చ‌న్‌.. ఫోటోలు వైర‌ల్

Amitabh Bachchan Shares Picture of His Fractured Toe. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఒక ప‌నిని ఒప్పుకున్నారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Oct 2021 12:36 PM IST
నొప్పితోనే షూటింగ్‌ చేసిన అమితాబ్ బ‌చ్చ‌న్‌.. ఫోటోలు వైర‌ల్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఒక ప‌నిని ఒప్పుకున్నారు అంటే.. వీలైనంత‌వ‌ర‌కు ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఆ ప‌నిని ఎవ్వ‌రికి ఇబ్బంది క‌ల‌గ‌కుండా పూర్తి చేస్తారు. కొన్నిసార్లు ఆయ‌న ఆరోగ్యాన్ని లెక్క‌చేయ‌కుండా.. ఎన్నో సార్లు ఆస్ప‌త్రి నుంచి షూటింగ్‌కు వెళ్లిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఆయ‌న సినిమాలే కాకుండా కౌన్‌ బనేగా కరోడ్‌పతి 13 సీజ‌న్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హరిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల అమితాబ్ కాలికి గాయ‌మైన‌ప్ప‌టికి ఇబ్బంది ప‌డుతూనే కౌన్‌ బనేగా కరోడ్‌పతి 13 షూటింగ్‌లో పాల్గొన్నారు. నొప్పిని పంటి బిగువ‌న బిగ‌ప‌ట్టి.. షోకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కొన‌సాగించ‌డం విశేషం.

ఆ షోకి సంబంధించి నవరాత్రి స్పెషల్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ జరిగింది. అందులో కాలి వేళ్లకి గాయమైన అలాగే షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. అమితాబ్ త‌న బ్లాగ్‌లో పోస్టు చేశారు. బేస్ వ‌ద్ద కాలివేలు విరిగిందన్నారు. విప‌రీతంగా నొప్పి ఉంద‌ని.. దానికి ఇలాగే ట్రీట్‌మెంట్ చేయ‌లేం కానీ.. దాన్ని వేరే వేలితో క‌లిపి ఉంచ‌డం ద్వారా.. నాలుగు లేదా ఐదు వారాల్లో త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. నొప్పిని ప్లాస్ట‌ర్‌తో క‌ప్పి ఉంచ‌లేమ‌ని రాసుకొచ్చారు. ఇక ఈ షోలో గాయం క‌నిపించ‌కుండా ఉండేందుకు అమితాబ్ బూట్లు ధ‌రించారు.

ఇక అమితాబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ మారాయి. అమితాబచ్చన్ వీలైనంత త్వరగా గాయం నుంచి కోలుకోవాల‌ని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. 'చెహ్రే', 'బ్రహ్మస్త్ర', ప్రాజెక్ట్ కె, గుడ్‌బాయ్‌ వంటి సినిమాల్లో అమితాబ్ న‌టిస్తున్నారు.

Next Story