అమితాబచ్చన్‌ ఎడమ కాలుకు గాయం.. నరం తెగడంతో ఆస్పత్రికి తరలింపు

Amitabh Bachchan says he cut a vein on left calf, was rushed to hospital. బాలీవుడ్‌ మెగా హీరో అమితాబ్‌ బచ్చన్‌ ఎడమ కాలుకు గాయమైంది. ఎడమ కాలు నరం కట్‌ కావడంతో అమితాబ్‌ను

By అంజి
Published on : 23 Oct 2022 3:12 PM IST

అమితాబచ్చన్‌ ఎడమ కాలుకు గాయం.. నరం తెగడంతో ఆస్పత్రికి తరలింపు

బాలీవుడ్‌ మెగా హీరో అమితాబ్‌ బచ్చన్‌ ఎడమ కాలుకు గాయమైంది. ఎడమ కాలు నరం కట్‌ కావడంతో అమితాబ్‌ను ఆస్పత్రికి తరలించారు. కౌన్‌ బనేగా కరోడ్‌ పతి షోలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు అమితాబ్ తన బ్లాగ్‌లో వెల్లడించారు. షో చేస్తున్న టైంలో చిన్న ఇనుప ముక్క తన ఎడమ కాలికి తగిలి నరం కట్‌ అయిందని చెప్పారు. వెంటనే ఆస్పత్రికి తరలించారని, రక్తస్రావం నియంత్రించడానికి కుట్లు వేశారని చెప్పారు. ప్రస్తుతం తాను బాగున్నానని, తన గురించి అభిమానులు ఎలాంటి ఆందోళన చెందొద్దని కోరారు.

ఒక ఇనుప ముక్క తన ఎడమ కాలుకు తగలడంతో నరం తెగిపోయిందని, దీంతో రక్తం స్రావం అయ్యిందని చెప్పారు. రక్తస్రావాన్ని ఆపేందుకు కుట్లు వేశారని, షో స్టాఫ్‌ టీమ్‌, డాక్టర్ అక్కడే ఉన్నారు. అయితే ఇప్పుడే వాకింగ్‌ లాంటివి చేయొద్దని డాక్టర్లు చెప్పారని అమితాబ్‌ బచ్చన్‌ అన్నారు. ఫిల్మ్ ఫ్రంట్‌లో అమితాబ్‌ బచ్చన్ ఇప్పటివరకు 2022లో నాలుగు చిత్రాలలో నటించారు. 'ఝండ్', 'రన్‌వే 34', 'బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ - శివ', 'గుడ్‌బై'. అమితాబ్‌ తన తదుపరి సినిమా సూరజ్ బర్జాత్య దర్శకత్వంలో తెరకెక్కతున్న 'ఉంఛై' చిత్రంలో నటిస్తున్నాడు. ఇది నవంబర్ 11న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నీనా గుప్తా, పరిణీతి చోప్రా, డానీ డెంగ్‌జోంగ్పా మరియు బోమన్ ఇరానీ కూడా నటించారు.


Next Story