అనారోగ్యంపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన బిగ్‌బీ

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ అనారోగ్యానికి గురయ్యారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి.

By Srikanth Gundamalla  Published on  16 March 2024 12:30 PM IST
amitabh bachchan, clarity,  health,  bollywood,

అనారోగ్యంపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన బిగ్‌బీ 

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ అనారోగ్యానికి గురయ్యారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన ఈ వార్తలపై స్పందించారు. వాటిని ఖండించారు. మార్చి 15న రోజంతా ఆయన అనారోగ్యానికి గురయ్యారంటూ వార్తలు వచ్చాయి. దాంతో.. బిగ్‌బీ అభిమానులు ఆందోళన చెందారు. ఆయన ఆరోగ్యంపై వివరణ కోసం అందరూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరారని అక్కడ యాంజియోప్లాస్టీ చికిత్స చేశారని వార్తలు వినిపించాయి.

అమితాబ్‌ బచ్చన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే వార్తలు వచ్చిన కాసేపటికే ఆయన బహిరంగ ప్రదేశంలో కనిపించారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరు అయ్యారు. థానేలోని దాదోజీ కొండదేవ్‌ స్టేడియంలో మాఝీ ముంబై, టైగర్స్ ఆఫ్‌ కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌ కు కుమారుడితో అమితాబ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా అనారోగ్యం గురించి వార్తలు వస్తున్నాయనీ.. నిజమేనా అని మీడియా వారు అమితాబ్‌ను ప్రశ్నించారు. అందులో నిజం లేదనీ.. ఆ వార్తలు ఫేక్‌ అని అమితాబ్‌ బచ్చన్ చెప్పారు. దాంతో .. ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు బిగ్‌బీ కోకిలాబెన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారంటూ వార్తలు వినిపించిన నేపథ్యంలో.. ఆస్పత్రి యాజమాన్యం కూడా ఎలాంటి ప్రకటన వెలువరుచలేదు. బిగ్‌బీ క్లారిటీతో పాటు.. ఆస్పత్రి యాజమాన్యం కూడా ఎలాంటి విషయం వెల్లడించకపోవడంతో ఫేక్‌ న్యూస్‌ అని తేల్చారు.

ISPL ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ కూడా పాల్గొన్నారు. అమితాబ్‌ బచ్చన్, సచిన్ టెండూల్కర్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమితాబ్‌ కల్కి 2898 ఏడీ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ 2024 మే 9న థియేటర్లలో విడుదల కానుంది.


Next Story