'ఓ రాక్ష‌సుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు క‌ద‌రా'

Amigos trailer Kalyan Ram as the Devil in the Dark.నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తున్న చిత్రం అమిగోస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2023 9:53 AM IST
ఓ రాక్ష‌సుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు క‌ద‌రా

'బింబిసార' చిత్రంతో బ్లాక్ బాస్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు క‌ళ్యాణ్ రామ్‌. ఈ చిత్రం త‌రువాత ఆయ‌న న‌టిస్తున్న‌ చిత్రం 'అమిగోస్‌'. ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌కుడు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 10వ తేదీన ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను శుక్ర‌వారం విడుదల చేశారు. ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. యాక్ష‌న్ సీన్స్ చిత్రంపై అంచ‌నాల‌ను పెంచేశాయి. మ‌నిషిని పోలిన మ‌నుషులు కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కిన‌ట్లు ట్రైల‌ర్‌ను చూస్తే అర్థం అవుతుంది. "మనం ఫ్రెండ్స్ కాదు.. బ్రదర్స్ అంతకంటే కాదు.. జస్ట్ లుక్ ఏలైక్స్ "అంటూ కల్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ అల‌రిస్తోంది.

Next Story