శివకర్తికేయన్-శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన పరాశక్తి సినిమాకు ఓపెనింగ్ వీకెండ్ మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ చిత్రం తమిళ సినిమా లెజెండ్స్ రజినీకాంత్, కమల్ హాసన్ నుండి ప్రశంసలు అందుకుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాను ప్రత్యేకంగా అభినందించడం సినిమాకు ప్లస్ గా మారింది.
చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో శివకార్తికేయన్ "నా తలైవర్ రజనీకాంత్ సార్ ఫోన్ చేసి సినిమా గురించి మాట్లాడారు. 'ఇది చాలా బోల్డ్ సినిమా. ముఖ్యంగా సెకండాఫ్ అద్భుతంగా ఉంది" అని మెచ్చుకున్నారని తెలిపారు. తన నటనను కూడా ఆయన ప్రశంసించారన్నారు శివ కార్తికేయన్. కమల్ హాసన్ కూడా సినిమా చూసి చిత్ర బృందాన్ని అభినందించారని శివకార్తికేయన్ వివరించారు. కమల్ సార్ నుంచి ప్రశంసలు అందుకోవడం అంత సులభం కాదు. ఆయన నాతో ఐదు నిమిషాల పాటు సినిమా గురించి మాట్లాడారు. ఇది తనకు దక్కిన పెద్ద గౌరవం అని ఆనందం వ్యక్తం చేశారు.
పరాశక్తి సినిమాకి కలెక్షన్లలో పెరుగుదల అవసరం ఉంది. ఈ సినిమాకు ప్రశంసలు వస్తున్నా, ప్రేక్షకుల నుండి ఈ చిత్రం మిశ్రమ స్పందన పొందింది. మంచి ప్రారంభ వారం తరువాత కలెక్షన్లు తగ్గాయి. కానీ పండగ సీజన్ ప్రారంభమవుతున్నందున కలెక్షన్లలో భారీ పెరుగుదల కనిపించే అవకాశం ఉంది.