ఆలియా భట్ ను ఐశ్వర్య రాయ్ అనుకుని కన్ఫ్యూజ్ అయ్యారట..!

American media confuses Alia Bhatt with Aishwarya Rai Bachchan at Met Gala 2023. ఆలియా భట్ ఇటీవల మొదటిసారిగా మెట్ గాలా ఈవెంట్ కు హాజరైంది.

By Medi Samrat  Published on  3 May 2023 10:45 AM GMT
ఆలియా భట్ ను ఐశ్వర్య రాయ్ అనుకుని కన్ఫ్యూజ్ అయ్యారట..!

ఆలియా భట్ ఇటీవల మొదటిసారిగా మెట్ గాలా ఈవెంట్ కు హాజరైంది. ఆమెకు సంబంధించిన చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు రెడ్ కార్పెట్ పై నడుస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది అమెరికన్ మీడియాకు చెందిన వారు.. ఆమెను ఫోటోల కోసం ఫోజులు ఇవ్వమని అడిగే సమయంలో ఆమెను 'ఐశ్వర్య.. ఐశ్వర్య' అంటూ పిలిచారు. మెట్ గాలాలో ఆలియా భట్ పాల్గొనడం ఇదే మొదటి సారి. ఎన్నో సంవత్సరాలుగా అంతర్జాతీయ గుర్తింపును సంపాదించుకుంది ఐశ్వర్య రాయ్‌. ఆమె హాజరైందేమో అనుకుని ఫోటోగ్రాఫర్లు కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే ఆలియా నొచ్చుకోకుండా చిరునవ్వుతో కెమెరాలకు పోజులివ్వడం కొనసాగించింది.

న్యూయార్క్ సిటీలో నిర్వహించిన మెట్ గాలా 2023 వేడుకల్లో ప్రత్యక ఆకర్షణగా నిలిచింది ఆలియా భట్. దాదాపు లక్ష్య ముత్యాలతో రూపొందించిన తెల్లటి లాంగ్ ఫ్రాక్ ను ఆలియా భట్ ధరించి రెడ్ కార్పెట్ పై నడిచింది. ఈవెంట్ కు సంబంధించిన ఫొటోని అలియాభట్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. సంప్రదాయ తరహాలో ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. ఈ ఎండ్రాయిడరీని భారత్ లోనే లక్ష ముత్యాలతో రూపొందించారని తెలిపింది.


Next Story