గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌.. మొక్క‌లు నాటిన అమీర్‌ఖాన్‌

Ameerkhan participated in Green India Challenge.టీఆర్ఎస్ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Sept 2021 2:54 PM IST
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌.. మొక్క‌లు నాటిన అమీర్‌ఖాన్‌

టీఆర్ఎస్ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం నిర్విఘ్నంగా కొన‌సాగుతోంది. సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు అంద‌రూ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. తాజాగా బాలీవుడ్ న‌టుడు అమీర్‌ఖాన్ ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో న‌టుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌, ఎంపీ సంతోష్‌కుమార్‌తో క‌లిసి మొక్క‌లు నాటారు.

ఈ సంద‌ర్భంగా అమీర్‌ఖాన్ మాట్లాడారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. మొక్క‌లు నాట‌డంతో పాటు వాటిని సంర‌క్షించాల‌ని సూచించారు. అప్పుడే భ‌విష్య‌త్ త‌రాల‌కు మంచి జీవితాల‌ను అందించిన వార‌ము అవుతామ‌ని చెప్పారు. దీన్ని ఒక కార్య‌క్ర‌మంగా కాకుండా.. నిత్య జీవితంలో భాగం చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు.

Next Story