అఫీషియ‌ల్‌.. 'పుష్ప' ఓటీటీ రిలీజ్​ డేట్ ఫిక్స్

Amazon Prime Video To Announce Pushpa OTT Release Date.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన చిత్రం పుష్ప‌. సుకుమార్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jan 2022 7:18 AM GMT
అఫీషియ‌ల్‌.. పుష్ప ఓటీటీ రిలీజ్​ డేట్ ఫిక్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన చిత్రం 'పుష్ప‌'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు విడుద‌లైన అన్నిచోట్ల క‌లెక్ష‌న్ల సునామీని సృష్టించింది. కాగా.. ఈ చిత్ర ఓటీటీ విడుద‌ల తేదీ కూడా ఫిక్స్ అయింది. అమెజాన్ ఫ్రైమ్‌లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో జ‌న‌వ‌రి 7 నుంచి పుష్ప చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు అమెజాన్ ప్రైమ్ ట్వీట్ చేసింది. మ‌రో రెండు రోజుల్లో ఈ చిత్రాన్ని వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు థియేటర్లలో పుష్పరాజ్ హవా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసిన‌ట్లు చెబుతున్నారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్లలో ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో 'పుష్ప' ఓటీటీ రిలీజ్ చేయ‌డం పెద్ద సాహ‌సం అనే చెప్పాలి.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. బన్నీ సరసన రష్మిక హీరోయిన్‌గా నటించింది. సునీల్‌, ఫహద్‌ ఫాజిల్‌, అనసూయ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియా, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు.

Next Story
Share it