రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతున్న అమరన్

శివ కార్తికేయన్ కొత్త సినిమా అమరన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధిస్తోంది.

By Kalasani Durgapraveen  Published on  3 Nov 2024 6:50 PM IST
రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతున్న అమరన్

శివ కార్తికేయన్ కొత్త సినిమా అమరన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. మూడవ రోజు ఆ సినిమా మొదటి రోజు కలెక్షన్లను అధిగమించగలిగింది. కేవలం మూడు రోజుల్లోనే 106 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. శివ కార్తికేయన్ కెరీర్ లో మూడవ 100 కోట్ల చిత్రంగా అమరన్ సినిమా నిలిచింది. శివ కార్తికేయన్ డాన్ సినిమా అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. సినిమా జోరును బట్టి చూస్తే, ఈ చిత్రం 200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. నిలకడగా వసూళ్లు సాధిస్తే బాక్సాఫీస్ రికార్డులను మరింత బద్దలు కొట్టే అవకాశం ఈ సినిమాకు ఉంది.

రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించారు. కమల్‌హాసన్, ఆర్‌. మహేంద్రన్‌ నిర్మించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 31న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి రిలీజ్‌ చేశారు.

Next Story