నటి అమలాపాల్‌కు చేదు అనుభవం
Amala Paul denied entry to Kerala temple.సినీ నటి అమలాపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది.
By తోట వంశీ కుమార్
సినీ నటి అమలాపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆలయం లోపలికి వెళ్లకుండా ఆలయ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఎర్నాకుళంలోని తిరువైరానికుళం మహాదేవ ఆలయంలో హిందూ భక్తులకు మాత్రమే అనుమతి ఉంది. ఇతర మతాల వాళ్లు ఆలయంలోకి వెళ్లేందుకు వీలులేదు. అయితే.. ఇటీవల నటి అమలాపాల్ తన స్నేహితులతో కలిసి ఆలయానికి వెళ్లింది. అమలాపాల్‌ను ఆలయంలోనికి వెళ్లకుండా ఆలయ అధికారులు అడ్డుకున్నారు. అమలాపాల్ క్రిస్టియన్ మతస్తురాలు కావడమే అందుకు కారణం.
దీనిపై అమలాపాల్ తీవ్ర నిరాశ చెందింది. " అన్యమతస్థురాలిని అని నన్ను ఆలయంలోకి అనుమతించలేదు. ఆలయంలోకి వెళ్లకపోయినా దూరం నుంచే అమ్మవారిని ప్రార్థించా. అమ్మవారి శక్తిని ఫీల్ అయ్యా. ఆలయంలోకి నన్ను వెళ్లనివ్వకపోవడంతో తీవ్ర నిరాశ చెందా. 2023లోనూ మతపరమైన వివక్ష ఇంకా కొనసాగుతుండడం విచారకరం. త్వరలో మార్పు వస్తుందని బావిస్తున్నా. మతం ప్రాతిపదికన కాకుండా అందరినీ సమానంగా చూసే సమయం రావాలని కోరుకుటుంన్నా." అని అమలాపాల్ ఆలయ సందర్శకుల రిజిస్టర్‌లో రాసింది.