'ఆల్ మోస్ట్ పడిపోయిందే' వీడియో సాంగ్‌.. విశ్వ‌క్ డ్యాన్స్, నివేత అందాలు

Almost Padipoyinde Pilla Video Song from Dhamki.విశ్వ‌క్ సేన్‌ హీరోగా న‌టిస్తున్న చిత్రం ధ‌మ్మీ.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Dec 2022 12:02 PM IST
ఆల్ మోస్ట్ పడిపోయిందే వీడియో సాంగ్‌.. విశ్వ‌క్ డ్యాన్స్, నివేత అందాలు

విభిన్న క‌థ‌లు ఎంచుకుంటూ త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వ‌క్ సేన్‌. ఆయ‌న హీరోగా న‌టిస్తున్న చిత్రం 'దమ్కీ'. నివేత పేతురాజ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, పాట సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది.

'ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా' లిరిక‌ల్ పాట‌ ఇప్ప‌టికే విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. అలాంటి పాట ఇప్పుడు వీడియో సాంగ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పాట‌ను తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ బాష‌ల్లో విడుద‌ల చేశారు. చాలా చాలా మంచి మంచి లోకేష‌న్స్‌లో ఈ పాట‌ను షూట్ చేశారు. విశ్వ‌క్ డ్యాన్స్ తో నివేత పేతురాజ్ హాట్ హాట్ అందాల‌తో ఆక‌ట్టుకుంది. ఇద్ద‌రి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఈ వీడియో సాంగ్‌తో సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్ని అంటుకున్నాయి. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

Next Story