'అల్లుడు అదుర్స్' ట్రైలర్ విడుదల.. కామెడీతో చించేశారుగా
Alludu Adhurs movie trailer released.యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న తాజాగా చిత్రం అల్లుడు అదుర్స్
By తోట వంశీ కుమార్ Published on 5 Jan 2021 7:23 PM ISTయువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న తాజాగా చిత్రం అల్లుడు అదుర్స్. కందీర ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైలర్ ను విడుదల చేశారు.
బేసిక్ గా కొన్ని అనివార్య కారణాల వల్ల అమ్మాయిలంటే నాకు పడదు సర్. లవ్వంటే నాన్సెన్స్ అని ఫీల్ అయ్యేవాడిని.అలాంటిది మీ అమ్మాయి ఇంట్రడక్షన్ తో నా క్యారక్టర్ మొత్తం టర్న్ అయింది'' అంటూ ప్రకాష్ రాజ్ మెడకు కత్తి పెట్టి సాయి శ్రీనివాస్ హీరోయిన్ కి ఐ లవ్ యూ చెప్పడంతో ట్రైలర్ స్టార్ట్ అయింది. 'ఒక్కసారి నాది అనుకుంటే ప్రాణం ఇస్తా.. అదే నా క్యారెక్టరైజేషన్' అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 'శ్రీనుగాడు నా ఫ్రెండ్.. యాక్షన్ సీక్వెన్స్‌లో వాడిది సపరేట్ ట్రెండ్.. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ లేవమ్మా 'అంటూ వెన్నెల కిషోర్ చెబుతున్న డైలాగ్‌లు నవ్వులు పూయిస్తోంది.
గంజి రమేష్ కుమార్ సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గొర్రెల సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో నభా నటేష్, అనూ ఇమాన్యుల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. 'బిగ్ బాస్' ఫేమ్ మోనల్ స్పెషల్ సాంగ్ చేసింది. ప్రకాశ్‌రాజ్, సోనూసూద్ లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.