హీరోయిన్ ను సైకో అంటూ విషెష్ చెప్పిన మెగా హీరో..!

Anu Emmanuel's birthday. మెగా హీరో అల్లు శిరీష్-అను ఎమ్మాన్యుయేల్ కూ 'హ్యాపీ బర్త్‌డే సైకో' అంటూ విషెస్‌ చెప్పాడు

By Medi Samrat  Published on  30 March 2021 8:53 AM GMT
birthday wishes to Anu Emmanuel

మెగా హీరో అల్లు శిరీష్-అను ఎమ్మాన్యుయేల్ జతగా ఇప్పుడు ఓ సినిమా తెరకెక్కుతోంది. అను ఎమ్మాన్యుయేల్ గతంలో మెగా హీరోలైన పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ తో 'నాపేరు సూర్య' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే..! ఇప్పుడు అల్లు శిరీష్ తో సినిమా చేస్తూ ఉండడంతో వారి మధ్య మంచి బాండింగ్ వచ్చేసింది. ఇద్దరి సోషల్ మీడియా ఖాతాల్లోనూ ఇటీవలి కాలంలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలను చూడొచ్చు. తాజాగా అల్లు శిరీష్ అనును 'సైకో' అంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పోస్టు చేయడంతో వీరిద్దరి మధ్య మరేదో ఉందనే ప్రచారం మొదలైంది.

వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకు తగ్గట్టుగా అల్లు శిరీష్ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. మార్చి 28న అను ఇమ్మాన్యుయేల్‌ పుట్టినరోజు జరిగింది. తాను ఆల‌స్యంగా విషెస్‌ చెబుతున్నానని త‌నకు తెలుసని శిరీష్ అన్నాడు. ఈ వీడియోతో రావడానికి లేట్‌ అయ్యిందని పేర్కొన్నాడు. 'హ్యాపీ బర్త్‌డే సైకో' అంటూ విషెస్‌ చెప్పాడు. ప్ర‌స్తుతం అనుతో అల్లు శిరీష్ డేటింగ్‌లో ఉన్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంతకూ ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.


Next Story