త‌గ్గేదే లే అంటున్న పుష్ప‌.. అదే రోజున హిందీ వెర్ష‌న్

Allu Arjun's Pushpa hindi version release date confirmed.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Dec 2021 10:21 AM GMT
త‌గ్గేదే లే అంటున్న పుష్ప‌.. అదే రోజున హిందీ వెర్ష‌న్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం 'పుష్ప‌'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న ర‌ష్మిక మందాన న‌టిస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈమూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. అన్ని భాష‌ల్లో తొలి భాగం డిసెంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అయితే.. కొన్ని స‌మ‌స్య‌ల కార‌ణంగా హిందీ వెర్ష‌న్ విడుద‌ల వాయిదా ప‌డే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపించాయి. డ‌బ్బింగ్ రైట్స్ స‌మ‌స్య కార‌ణంగానే హిందీ వెర్ష‌న్ వాయిదా ప‌డుతుంద‌నేది ఆ వార్తల సారాంశం.

తాజాగా కొత్త పోస్ట‌ర్ ద్వారా ఆ వార్త‌ల‌న్నింటికి చిత్ర బృందం పుల్‌స్టాప్ ప‌ట్టేసింది. హిందీ వెర్ష‌న్ కూడా ఆ డిసెంబ‌ర్ 17నే విడుదల చేయ‌నున్న‌ట్లు పోస్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. తొలుత ఈ చిత్రాన్ని హిందీలో విడుద‌ల చేయాల‌ని అనుకోలేదు. దీంతో పుష్ప హిందీ డ‌బ్బింగ్ రైట్స్‌ను గోల్డ్‌మైన్ ఫిల్మ్స్‌కు అమ్మేశారు. అయితే.. త‌రువాత త‌మ నిర్ణ‌యాన్ని మార్చుకోవ‌డంతో స‌మ‌స్య మొద‌లైంది. అనంత‌రం సామ‌ర‌స్య పూర్వ‌కంగా చిత్ర‌బృందం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుని అన్ని బాష‌ల్లో విడుద‌ల చేసేందుకు సిద్ద‌మైంది.

ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ నెల 17నే విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్ర ట్రైల‌ర్‌ను ఈనెల 6న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ఇప్ప‌టికే వెల్ల‌డించింది. ఈ చిత్రంలో మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, సునీల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Next Story
Share it