ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు క‌రోనా పాజిటివ్‌

Allu Arjun tests corona positive.తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 April 2021 11:50 AM IST
Allu Arjun

టాలీవుడ్‌లో క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు న‌టీ, న‌టులు, ప్రొడ్యూస‌ర్లు క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. తనకు కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింద‌ని.. ప్ర‌స్తుతం ఇంటి వ‌ద్ద‌నే ఐసోలేష‌న్‌లో ఉన్నాడ‌ని తెలిపారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని బ‌న్నీ ట్వీట్ చేశారు.

నాకు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌లు, డాక్ట‌ర్ల సూచ‌న‌లు పాటిస్తూ ప్ర‌స్తుతం నేను ఇంట్లోనే ఐసోలేట్ అయ్యాను. ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన వారంద‌రూ వెంట‌నే ప‌రీక్ష చేయించుకోవాల‌ని కోరుతున్నాను. అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా అంద‌రూ వ్యాక్సిన్ వేయించుకోండి. జాగ్ర‌త్త‌గా ఇంట్లోనే ఉండండి. ప్ర‌స్తుతానికి నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అభిమానులెవ‌రూ ఆందోళ‌న చెంద‌వద్ద‌ని కోరుతున్నాన‌ని బన్నీ ట్వీట్ చేశారు. ఈ విష‌యం తెలిసిన సినీ ప్ర‌ముఖుల‌తో పాటు అభిమానులు ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నారు.




Next Story