అల్లుఅర్జున్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. వైల్డ్ కాంబో ఫిక్స్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 March 2023 9:46 AM IST
Allu Arjun Sandeep Reddy Vanga combo, Allu Arjun teams up with Sandeep Reddy Vanga

Allu Arjun Sandeep Reddy Vanga

సినీ ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓ క్రేజీ కాంబో ఎట్ట‌కేల‌కు సెట్ అయ్యింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కనుంది. టీ సిరీస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ ఈ ఉద‌యం సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. దీంతో సినీ ప్రేక్ష‌కులు ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు పుల్ ఖుషీలో ఉన్నారు. అయితే.. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు మొద‌లు కానుంది. ఈ చిత్రంలో న‌టించే న‌టీన‌టులు ఎవ‌రు అనే వివ‌రాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు.

ప్ర‌స్తుతం అల్లు అర్జున్ 'పుష్ప 2' చిత్రంలో న‌టిస్తున్నారు. 'పుష్ప 1' భారీ విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డంతో అంత‌కు మించి 'పుష్ప 2'ను తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుకుమార్. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ మొద‌లైంది.

అటు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం రణ్ బీర్‌కపూర్‌ హీరోగా 'యానిమల్' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా మొద‌లైంది. శ‌ర వేగంగా కొన‌సాగుతోంది. ఇటీవ‌లే ర‌ణ్‌బీర్ క‌పూర్ వైల్డ్ లుక్‌ని విడుద‌ల చేయ‌గా.. ఆయ‌న అవ‌తారం చూసి బాలీవుడ్ జ‌నాలు ఆశ్చ‌ర్య‌పోయారు.

అర్జున్ రెడ్డి చిత్ర స‌క్సెస్ త‌రువాత సందీప్‌-బ‌న్నీ కాంబినేష‌న్ ఓ చిత్రం వ‌స్తే బాగుంటుంద‌ని టాలీవుడ్ ప్రేక్ష‌కులు కోరుకోగా వారి కోరిక త్వ‌ర‌లోనే నెర‌వేర‌నుంది.

Next Story