'పుష్ప-2' నుంచి కపుల్‌ సాంగ్.. 'సూసేకి' అదిరిపోయిందిగా..!

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ మూవీ పుష్ప-ది రూల్‌.

By Srikanth Gundamalla  Published on  29 May 2024 12:15 PM IST
allu arjun, pushpa-2 movie, tollywood, couple song sooseki,

'పుష్ప-2' నుంచి కపుల్‌ సాంగ్.. 'సూసేకి' అదిరిపోయిందిగా..!

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ మూవీ పుష్ప-ది రూల్‌. ఈ సినిమా కోసం టాలీవుడ్‌ మాత్రమే కాదు.. పాన్‌ ఇండియా, గ్లోబల్ సినిమా లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ సాంగ్.. టీజన్.. పోస్టర్లు ఆకర్షించాయి. పుష్ప పార్ట్ వన్‌ రికార్డులను నెలకొల్పింది.దాంతో.. పార్ట్‌-2 పైన కూడా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక తాజాగా ఇదే సినిమా నుంచి సెకండ్‌ సాంగ్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్‌. కపుల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు.

కపుల్‌ సాంగ్‌ సూసేటి అంటూ శ్రీవల్లి పాడుతున్న పాట అందరినీ ఆకట్టుకుంటోంది. వినడానికి చాలా బావుందని అంటున్నారు అభిమానులు. లిరిక్స్‌తో పాటుగా.. సెట్స్‌లో ఈ పాటకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. పాటను వింటూ ఎంజాయ్‌ చేస్తూనే.. సెట్స్‌లో రష్మిక, అల్లు అర్జున్‌ని చూసి మైమరిచిపోతున్నారు. కాగా..ఈ సినిమాకు సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. రాక్‌స్టార్‌ దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. మరోసారి హిట్‌ సాంగ్స్‌ను ఇస్తున్నారంటూ దేవీ శ్రీప్రసాద్‌ను అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.

పుష్ప-ది రూల్‌ సినిమాను ఆగస్టు 15న వరల్డ్‌ వైడ్‌గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్‌ ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌ని మొదలుపెట్టారు. ఇప్పుడు అంతా పుష్ప మూవీ నుంచి వచ్చిన సెకండ్‌ పాట సూసేకి పైనే పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి అంటూ సాగే కపుల్‌ సాంగ్‌ను లాంఛ్ చేశారు. ఈ పాటను చంద్రబోస్‌ రాశారు. పాపులర్ సింగర్ శ్రేయాఘోషల్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషలన్నింటిలో పాడటం విశేషం. ఈ సాంగ్‌ కూడా మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబట్టడం ఖాయమని లిరికల్‌ వీడియో సాంగ్‌ చెప్పకనే చెబుతోంది. ఇప్పటికే విడుదలైన పుష్ప సాంగ్‌ నెట్టింట మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది.


Next Story