పర్యావరణ దినోత్సవం.. అల్లు అర్జున్ వినూత్న ప్ర‌య‌త్నం.. అద్భుత స్పంద‌న‌

Allu Arjun plants saplings on world environment day.నేడు( జూన్ 5) అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం. ఈ సంద‌ర్భంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jun 2021 7:53 AM GMT
పర్యావరణ దినోత్సవం.. అల్లు అర్జున్ వినూత్న ప్ర‌య‌త్నం.. అద్భుత స్పంద‌న‌

నేడు( జూన్ 5) అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం. ఈ సంద‌ర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నూతన కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాడు. త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో మొక్క‌లు నాటి.. అంద‌రూ నాటాల‌ని పిలుపునిచ్చాడు. తాను మొక్క నాటి నీళ్లు పోస్తుండగా తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు. 'ప్రకృతి మన కోసం ఎంతో చేస్తుంది.. మనం కూడా మొక్కలు నాటి, తరువాత తరాలకు పచ్చటి వాతావరణాన్ని ఇస్తామని అందరం ప్రతిజ్ఞ చేద్దాం' అంటూ ట్వీట్ చేశాడు బ‌న్నీ.

కాలుష్యాన్ని తగ్గించడానికి కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి. మనం ప్రకృతిని ఎంత కాపాడితే, ప్రకృతి మనల్ని అంత కాపాడుతుంది. నేను ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర చొరవ తీసుకొని అడుగుతున్నాను. మీరు మొక్కలు నాటి, ఆ ఫోటోలను నాకు షేర్ చేయండి. భూమిని ర‌క్షించుకునేందుకు మ‌నంద‌రం కలిసి ప‌ని చేద్దాం వాటిలో కొన్ని ఫోటోలను నేను నా ట్విట్టర్ లో షేర్ చేస్తాను అని #GoGreenWithAA హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.

ప్రస్తుతం ట్వీట్‌ వైరల్ గా మారింది. అల్లు అర్జున్ పిలుపు మేర‌కు అభిమానులు మొక్క‌లు నాటుతున్నారు. మొక్క‌లు నాటుతున్న ఫోటోల‌ను #GoGreenWithAA హ్యాష్‌ట్యాగ్‌ను జోడించి ట్వీట్లు చేస్తున్నారు.
Next Story