అల్లు అర్జున్ లాంగ్ డ్రైవ్.. వీడియో వైరల్
Allu Arjun long drive with family.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో
By తోట వంశీ కుమార్ Published on 22 Oct 2021 2:19 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్ని సరసన రష్మిక మందాన నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌కి ఇటీవల కాస్త బ్రేక్‌ను ఇచ్చారు. దీంతో బన్ని తన కుటుంబంతో కలిసి సరదాగా కాలం గడుపుతున్నారు. ఇటీవలే ఫ్యామిలీతో మాల్దీవులకు వెళ్లొచ్చిన అల్లు అర్జున్.. తాజాగా కారులో లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లారు. అల్లు అర్జున్ స్వయంగా కారు నడుపుతుండగా.. కుమారై వెనుక కూర్చొని మొబైల్‌లో గేమ్స్ ఆడుతోంది. దీన్ని మొత్తాన్ని బన్ని భార్య స్నేహారెడ్డి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ వీడియోలో అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లోని గుచ్చే గులాబి లాగా సాంగ్ బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తోంది. ఈ పాటను వింటూ బన్ని ఎంజాయ్ చేయడం గమనించవచ్చు.
Bunny annaya ❤️
— Stylishstar abhimani 😎🔥 (@bunnyannacult22) October 21, 2021
Enjoying Guche gulabi laga song 💕#Alluarjun #Pushpa @alluarjun #MostEligibileBachelor pic.twitter.com/XNcaTwQyfy
ఇక పుష్ప చిత్రం రెండు బాగాలుగా తెరకెక్కుతోంది. మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్‌గా కనిపించనున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర తొలి భాగం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.