'పుష్ప మూవీ తేడా కొడితే.. తొలి రోజే నా చావు చూస్తారు'.. బ‌న్ని లేడి ఫ్యాన్ ట్వీట్ వైర‌ల్‌

Allu Arjun lady fan tweet on pushpa movie goes viral.ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Dec 2021 4:50 AM GMT
పుష్ప మూవీ తేడా కొడితే.. తొలి రోజే నా చావు చూస్తారు.. బ‌న్ని లేడి ఫ్యాన్ ట్వీట్ వైర‌ల్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం 'పుష్ప‌'. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూడో చిత్రం కావ‌డంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. పాన్ ఇండియా లెవ‌ల్‌లో రెండు బాగాలుగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇక తొలి భాగం 'పుష్ప ది రైజ్' డిసెంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ఇటీవ‌ల ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. అయితే.. ఈ ట్రైల‌ర్ చూసి కొంత మంది అభిమానులు నిరుత్సాహానికి గురి అయ్యారు.

ఈ నేప‌థ్యంలోనే సోష‌ల్ మీడియాలో ఓ ట్వీట్ వైర‌ల్ అవుతోంది. దేవుడు మ‌రియు అమ్మ సాక్షిగా చెబుతున్నా.. పుష్ప సినిమా ఏదైనా తేడా కొడితే సినిమా తొలి రోజునే నా చావును చూస్తారు అంటూ ఓ మ‌హిళా అభిమాని చిత్ర‌బృందాన్ని బెదిరించింది. "ట్రైల‌ర్ చూసి నా మ‌న‌సు చ‌చ్చి పోయింది. ఇన్ని రోజులు మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి ట్వీట్ చేశాను సుక్కుసార్‌. పుష్ప మూవీ ఏమైనా తేడా కొడితే మొద‌టి రోజే నా చావును చూస్తారు. దేవుడు మ‌రియు అమ్మ మీద ఓట్టు. ల‌వ్ యూ అల్లుఅర్జున్ అంటూ " శృతి అనే మ‌హిళ ట్వీట్ చేసింది.

Advertisement

ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనిపై చిత్ర‌బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. పుష్ప అనేది కేవ‌లం చిత్రం మాత్ర‌మే. సినిమా అన్నాక హిట్ అవ్వొచ్చు.. ప్లాప్ అవ్వొచ్చు. అంత మాత్రాన ప్రాణాలు తీసుకోవాలా..? హీరోల‌ను అభిమానించేలే కానీ.. ఇలా అయిన‌దానికి కానిదానికి ప్రాణాలు తీసుకోవ‌ద్దు అంటూ ప‌లువురు నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story
Share it