17 ఏళ్ల ఆర్య.. బ‌న్నీ ఎమోష‌న‌ల్ ట్వీట్

Allu Arjun emotional tweet on 17 years of arya.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌ను మ‌లుపు తిప్పిన చిత్రం ఆర్య‌ చిత్రం విడుద‌లై నేటిని 17 పూరైంది. .

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 May 2021 7:22 AM GMT
Arya

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌ను మ‌లుపు తిప్పిన చిత్రం 'ఆర్య‌'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం 2004 మే 7న‌ విడుద‌లైన ఈ చిత్రం అప్ప‌ట్లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ చిత్రం అంద‌రి హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది.' ఫీల్ మై ల‌వ్' అంటూ బ‌న్నీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ప్రేమికులు ఈ చిత్రానికి బాగా క‌నెక్ట్ అయ్యారు. ఈ చిత్రంలో దేవీ శ్రీ ప్ర‌సాద్ అందించిన 'నా ప్రేమ‌ను కోపంగాను నా ప్రేమ‌ను ద్వేషంగానూ', 'ఓ మై బ్ర‌ద‌రో', 'అ అంటే అమ‌లాపురం 'పాట‌లు ఇప్ప‌టికి వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ చిత్రంతో అటు సుకుమార్ గానీ, ఇటు బ‌న్నీ గాని త‌మ కెరీర్‌లో వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం విడుద‌లై నేటిని 17 పూరైంది. ఈ సంద‌ర్భంగా ఆ జ్ఞాప‌కాల‌ను త‌లుచుకుంటూ అల్లు అర్జున్ సోష‌ల్ మీడియాలో ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టాడు. 'ఆర్య చిత్రం విడుద‌లై నేటికి 17 ఏళ్లు అవుతుంది. నా లైఫ్ చేంజింగ్ చిత్రాల‌లో ఇది కూడా ఒక‌టి. జీవితంలో జ‌రిగిన గొప్ప అద్భుతం. ఫీల్ మై లవ్ అనే బంగారు ప‌దాల‌ను నేను ప‌లికిన త‌ర్వాత ప్రేక్ష‌కులు నాపై ప్రేమను కురిపించడం మొద‌లు పెట్టారు అంటూ' బ‌న్నీ ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం బ‌న్నీ.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలోనే పుష్ప సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.


Next Story