ఆర్‌ఆర్‌ఆర్‌పై ఐకాన్ స్టార్‌ రియాక్షన్ ఇదే

Allu Arjun congratulated RRR team for Massive success.యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 26 March 2022 2:22 PM IST

ఆర్‌ఆర్‌ఆర్‌పై ఐకాన్ స్టార్‌ రియాక్షన్ ఇదే

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం)'. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం నిన్న‌(మార్చి 25)న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. సినీ అభిమానుల‌తో పాటు పలువురు ప్ర‌ముఖులు ఈ చిత్రంపై ప్ర‌సంశ‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. సినిమా అద్భుతంగా ఉంద‌ని కొనియాడాడు. తన బ్రదర్ రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారన్నారు. అత‌డిని చూసి ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు. మరోవైపు తన బావ జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు అంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

'మనమంతా గర్వపడే రాజమౌళి విజన్ గొప్పగా ఉంది. నా అన్న మెగా పవర్ రామ్ చరణ్ తన కెరీర్ లోనే గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ చేశాడు. అందుకు గర్వంగా ఉంది. పవర్ హౌస్ లాంటి నా బావ తారక్ షో చూస్తే చాలా ముచ్చటేసింది. అతడంటే నాకు ఎప్పుడూ గౌరవం, ఇష్టమే. అజయ్ దేవగణ్, ఆలియా చాలా బాగా చేశారు. కీరవాణి, సెంథిల్ కుమార్, డీవీవీ దానయ్య.. ఇంకా అందరికీ ప్రత్యేక శుభాభినందనలు. భారతీయ సినిమాను గర్వపడేలా చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. నిజంగా ఇది KilleRRR'' అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.

Next Story