అల్లు అర్జున్ కార్‌వాన్‌కు ప్ర‌మాదం

Allu Arjun caravan accident in‌ Khammam.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Feb 2021 6:06 PM IST
అల్లు అర్జున్ కార్‌వాన్‌కు ప్ర‌మాదం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం 'పుష్ప‌'. సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న క‌థానాయిక న‌టిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స‌మీపంలోని మారేడుప‌ల్లి, రంప‌చోడ‌వ‌రం అడ‌వుల్లో జ‌రిగింది. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తి అయింది. దీంతో చిత్ర బృందం అల్లు అర్జున్‌తో స‌హా హైద‌రాబాద్ చేరుకుంది. అయితే.. అక్క‌డి నుంచి హైద‌రాబాద్‌కు వ‌స్తున్న అల్లు అర్జున్ కారవాన్‌కు ప్ర‌మాదం జ‌రిగింది. ఖ‌మ్మం స‌మీపంలో ఈరోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. అయితే.. అల్లు అర్జున్ ప్ర‌మాద స‌మ‌యంలో కార‌వాన్‌లో లేడ‌ని చిత్ర‌బృందం వెల్ల‌డించింది. కానీ అప్పుడు కార్వాన్ లో సినిమా మేకప్ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని విచార‌ణ చేప‌ట్టారు.

ఏజెన్సీ ఏరియాలో షూటింగ్ పూర్తి అయిన‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 'రంప‌చోడ‌వ‌రం, మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో పుష్ప చిత్రానికి సంబంధించిన రెండు భారీ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. సినిమా షూటింగ్‌కు స‌హ‌కరించిన ఆదివాసీలు, అధికారుల‌కు మా ధ‌న్య‌వాదాలు. మ‌ళ్లీ ఇక్క‌డ షూటింగ్ చేసేందుకు త‌ప్ప‌కుండా వ‌స్తాం' అని చిత్ర బృందం ట్వీట్ చేసింది.


'పుష్ప' సినిమాపై బన్నీ ఫ్యాన్స్ తో పాటు దాదాపు తెలుగు ప్రేక్షకులందరికి కూడా భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ అనే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఆగ‌స్టు 15న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.




Next Story