నేను బాగున్నాను.. అభిమానులూ ధైర్యంగా ఉండండన్న అల్లు అర్జున్

Allu Arjun about his health.అల్లు అర్జున్ కరోనా వచ్చిన విషయం తెలిసిందే , తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న అభిమానుల కోసం ఓ పోస్టు చేశారు.

By Medi Samrat  Published on  3 May 2021 6:29 PM IST
నేను బాగున్నాను.. అభిమానులూ ధైర్యంగా ఉండండన్న అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే కరోనా బారిన పడ్డారు. అల్లు అర్జున్ తనకు కరోనా వచ్చిందని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అల్లు అర్జున్ ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న అభిమానుల కోసం ఓ పోస్టు చేశారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, క్రమంగా కోలుకుంటున్నాని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. తానింకా క్వారంటైన్ లోనే ఉన్నానని అల్లు అర్జున్ వెల్లడించారు. తాను కరోనా బారినపడ్డానని తెలియగానే విశేష ప్రేమాభిమానాలు కురిపిస్తూ, తన కోసం ప్రార్థిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. అడవి నేపథ్యంలోని సన్నివేశాలను చాలా వరకూ చిత్రీకరించారు. చిత్రీకరణ కోసం ఆయన భారీస్థాయిలో విలేజ్ సెట్ ను ఏర్పాటు చేశారు. హీరోయిన్ రష్మిక గ్రామీణ యువతిగా కనిపించనుంది. ఆమెకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించడానికి నగర శివార్లలోని ఒక ప్రదేశంలో విలేజ్ సెట్ వేయిస్తున్నారు. సుకుమార్ 'రంగస్థలం' సినిమాకి కూడా విలేజ్ సెట్ వేయించారు. అలా 'పుష్ప' కోసం సెట్ వేస్తున్నారు.

ఇక అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'అల వైకుంఠపురములో' భారీ విజయాన్ని అందుకుంది. ఇక పూజా హెగ్డేతో కలిసి బన్నీ వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. తమన్‌ సంగీతం హైలెట్‌గా నిలవగా.. అందులోని సాంగ్స్ రికార్డులను కొల్లగొడుతూ ఉన్నాయి. రామజోగయ్యశాస్త్రి రాసిన 'బుట్టబొమ్మ' సాంగ్ మరో సంచలన రికార్డు అందుకుంది. యూట్యూబ్‌లో ఏకంగా 600 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆగస్ట్ 1న 300 మిలియన్ క్లబ్బులోకి అడుగు పెట్టిన బుట్టబొమ్మ.. అక్టోబర్‌లో మరో 100 మిలియన్స్ అందుకొని 400 మిలియన్లు చేరుకుంది. జనవరిలో 500 మిలియన్లకు చేరుకోగా.. తాజాగా ఈ సాంగ్‌ 600 మిలియన్స్‌ దాటింది. తెలుగులో ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు పాటగా రికార్డు క్రియేట్ చేసింది. మంచి మ్యూజిక్ కు పూజ హెగ్డే అందం.. అల్లు అర్జున్ గ్రేస్ తోడవ్వడంతో పాటను అభిమానులు తెగ వినాలి, చూడాలి అని అనుకుంటూ ఉన్నారు.

Next Story