'సభకు నమస్కారం' అంటూ వచ్చేస్తున్నాడు అల్లరినరేష్

Allari Naresh new movie is Sabhaku Namaskaram.అల్ల‌రి చిత్రంతో త‌న ప్ర‌స్థానం మొద‌లుపెట్టిన న‌రేష్ ఆ త‌రువాత వెనుదిరి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jun 2021 6:21 AM GMT
సభకు నమస్కారం అంటూ వచ్చేస్తున్నాడు అల్లరినరేష్

'అల్ల‌రి' చిత్రంతో త‌న ప్ర‌స్థానం మొద‌లుపెట్టిన న‌రేష్ ఆ త‌రువాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. ఒక‌ప్పుడు కామెడీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన న‌రేష్‌.. ఇప్పుడు న‌టుడిగా నిరూపించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. 'అల్లరి' నరేశ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తాజా చిత్రం 'సభకు నమస్కారం' తాలూకు టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. టైటిల్ కి తగినట్టుగానే ఆయన సభకు నమస్కారం చేస్తున్న పోస్టర్ ను వదిలారు.

ఈస్ట్‌ కోస్ట్‌ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లంపాటి సతీష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అబ్బూరి రవి సంభాషణలు సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. 'నాంది' తరువాత 'అల్లరి' నరేశ్ చేస్తున్న సినిమా ఇది.. కెరీర్‌ పరంగా ఇది ఆయనకు 58వ సినిమా.

Next Story
Share it