అనుపమ నోట బటర్ ఫ్లై పాట

All the Ladies Song from Butterfly Movie OUT.హీరోయిన్ అనుప‌మ పరమేశ్వరన్ న‌టిస్తున్న చిత్రం బటర్ ఫ్లై. లేడి ఓరియెంటెడ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 March 2022 3:05 PM GMT
అనుపమ నోట బటర్ ఫ్లై పాట

హీరోయిన్ అనుప‌మ పరమేశ్వరన్ న‌టిస్తున్న చిత్రం 'బటర్ ఫ్లై'. లేడి ఓరియెంటెడ్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి గంటా సతీష్ బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. థ్రిల్ల‌ర్ డ్రామాగా రూపుద్దిద్దుకుంటున్న ఈ చిత్రంలో భూమిక చావ్లా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. కాగా.. నేడు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్రంలోని ఆల్ ది లేడీస్ పాట‌ను విడుద‌ల చేసింది చిత్ర బృందం.

ఈ పాట‌కు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించ‌గా.. అనుపమ పరమేశ్వరన్ స్వయంగా పాటను పాడ‌డం విశేషం. శశి కొరియోగ్రఫీ చేయగా.. అర్విజ్ సంగీతాన్ని అందించారు. జెన్‌నెక్స్‌టి మూవీస్ బ్యానర్‌పై రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్ర విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్నారు.

అనుప‌మ పరమేశ్వరన్ ఈ చిత్రంతో పాటు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న '18 పేజెస్', చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న' కార్తికేయ 2 ' సినిమాల్లో న‌టిస్తోంది.

Next Story
Share it