సంజయ్ దత్ విషయంలో వస్తున్న వార్తలన్నీ పుకార్లే..!

ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ షూటింగ్ సమయంలో గాయపడ్డాడనే వార్తలు వైరల్ అయ్యాయి.

By M.S.R
Published on : 13 April 2023 5:00 PM IST

Sanjay Dutt, Bollywood, Kedi movie

సంజయ్ దత్ విషయంలో వస్తున్న వార్తలన్నీ పుకార్లే..! 

ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ షూటింగ్ సమయంలో గాయపడ్డాడనే వార్తలు వైరల్ అయ్యాయి. కన్నడ సినిమా 'కేడి' షూటింగ్ లో సంజయ్ దత్ గాయపడ్డాడని వార్తలు వచ్చాయి. యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి.

ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, తాను గాయపడలేదని సంజయ్ దత్ స్పష్టం చేసాడు. ఇవన్నీ అవాస్తవాలు అని, తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలిపాడు. ప్రస్తుతం 'కేడీ' సినిమా షూటింగ్ చేస్తున్నానని, తాను చేసే సన్నివేశాలు అన్నిటికీ ఈ సినిమా యూనిట్ సభ్యులు చాలా ముందు జాగ్రత్తలు తీసుకొని మరీ చేస్తున్నారని అన్నాడు సంజయ్. యూనిట్ వాళ్ళని అభినందించాడు సంజయ్ దత్.

Next Story