తోడబుట్టిన వాడిని కాపాడటం కోసం ఎంతకైనా తెగించే సోదరిగా 'ఆర్ఆర్ఆర్' హీరోయిన్‌

ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బాలీవుడ్ నటి ఆలియా భట్.

By M.S.R  Published on  5 Oct 2024 10:23 AM IST
తోడబుట్టిన వాడిని కాపాడటం కోసం ఎంతకైనా తెగించే సోదరిగా ఆర్ఆర్ఆర్ హీరోయిన్‌

ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బాలీవుడ్ నటి ఆలియా భట్. ఆమె నటించిన జిగ్రా సినిమా త్వరలో సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. కరణ్ జోహార్, అలియా భట్ కలిసి నిర్మించిన ఈ థ్రిల్లర్‌లో వేదాంగ్ రైనా కూడా నటించారు. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్‌ వచ్చింది. జిగ్రా రన్‌టైమ్ 155 నిమిషాలు (2 గంటల 35 నిమిషాలు) అని తెలుస్తోంది.

జిగ్రా చిత్రాన్ని ముందుగా సెప్టెంబర్ 27న విడుదల చేయాలని భావించారు. అయితే, దేవర: పార్ట్ 1తో క్లాష్ అవ్వకుండా సినిమా విడుదలను వాయిదా వేశారు. ఎన్టీఆర్ తో కలిసి ఆలియా జిగ్రా ప్రమోషన్స్ ను కూడా చేసింది. టాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్స్ జిగ్రా సినిమాను తెలుగులో ప్రమోట్ చేస్తున్నారు. తోడబుట్టిన వాడిని కాపాడడం కోసం ఓ సోదరి ఎంతకైనా తెగిస్తుందని చూపించే సినిమానే జిగ్రా.

అలియా భట్ చివరిగా కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో రణవీర్ సింగ్‌తో కలిసి నటించింది. వేదంగ్ రైనా జోయా అక్తర్ నెట్‌ఫ్లిక్స్ చిత్రం ది ఆర్చీస్‌ లో కనిపించాడు.

Next Story