మరోసారి డీప్ ఫేక్ బాధితురాలిగా మారిన అలియా భట్

బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ అలియా భట్ కొత్త డీప్‌ఫేక్ వీడియో వైరల్ కావడంతో ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారు.

By M.S.R  Published on  14 Jun 2024 5:00 PM IST
alia bhatt, deepfake video,  bollywood ,

మరోసారి డీప్ ఫేక్  బాధితురాలిగా మారిన అలియా భట్ 

బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ అలియా భట్ కొత్త డీప్‌ఫేక్ వీడియో వైరల్ కావడంతో ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారు. AI ద్వారా రూపొందించిన వీడియోలో, అలియా గెట్ రెడీ విత్ మీ ట్రెండ్‌లో చేరినట్లు కనిపిస్తోంది. సమీక్ష అవర్త్ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 17 మిలియన్లకు పైగా వ్యూస్ ను సంపాదించింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తన బయోలో “అన్ని వీడియోలు కేవలం వినోద ప్రయోజనాల కోసం AIని ఉపయోగించి రూపొందించబడ్డాయి” అని రాసుకొచ్చారు.

డీప్‌ఫేక్ క్లిప్ వైరల్ అయిన కొద్దిసేపటికే, అలియా భట్ అభిమానులు AI ఉపయోగంపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. పలువురు అభిమానులు “AI రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది” అని రాశారు. అలియా డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. ఈ సంవత్సరం మేలో అలియా డీప్ ఫేక్ వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. మే 7న న్యూయార్క్‌లో మెట్ గాలాకు హాజరైన అలియా భట్ సబ్యసాచి చీరలో అబ్బురపరిచింది. ఇక పలు క్రేజీ ప్రాజెక్టుల్లో అలియా భట్ భాగమైంది.

Next Story