ఆర్ఆర్ఆర్ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్ రానుంది

Alia Bhat first look from RRR on Her Birthday.ద‌ర్శ‌క‌దీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 13 March 2021 4:46 PM IST

ఆర్ఆర్ఆర్ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్ రానుంది

ద‌ర్శ‌క‌దీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ చిత్రంలో సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీ ప్రకటించినప్పటి నుండి 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంది. తాజాగా 'సీత' పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఫస్ట్ లుక్ ను మార్చి 15న విడుదల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఆ రోజు అలియా పుట్టిన రోజు సంద‌ర్భంగా ఉదయం 11 గంటలకు సీత పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం చెప్పింది.

"దివ్యతేజస్సుతో అలరారే మా సీత వస్తోంది... చూడండి" అంటూ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ ట్వీట్ చేసింది. మార్చి 15న ఉదయం 11 గంటలకు అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నామని వెల్లడించింది. ఎన్టీఆర్ కు జోడిగా కథానాయిక ఒలీవియా మారిస్‌ నటిస్తుంది. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులపై క్లైమాక్స్‌ షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Next Story