ఆ అపార్ట్‌మెంట్‌ను రూ.80 కోట్లకు అమ్మిన అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్, అతని భార్య ట్వింకిల్ ఖన్నా ముంబైలోని వర్లీలో సీ ఫేస్ అపార్ట్‌మెంట్‌ను 80 కోట్లకు విక్రయించారు.

By Medi Samrat  Published on  8 Feb 2025 6:30 PM IST
ఆ అపార్ట్‌మెంట్‌ను రూ.80 కోట్లకు అమ్మిన అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్, అతని భార్య ట్వింకిల్ ఖన్నా ముంబైలోని వర్లీలో సీ ఫేస్ అపార్ట్‌మెంట్‌ను 80 కోట్లకు విక్రయించారు. అపార్ట్‌మెంట్ ఒబెరాయ్ 360 వెస్ట్ ప్రాజెక్ట్ లోపల ఉంది. 6830 చదరపు అడుగుల విస్తీర్ణంలో, అపార్ట్‌మెంట్ 39వ అంతస్తులో ఉంది. నాలుగు పార్కింగ్ స్లాట్‌లతో వస్తుంది. జనవరి 31న నమోదైన డాక్యుమెంట్ల ప్రకారం అపార్ట్‌మెంట్ స్టాంప్ డ్యూటీ రూ.4.80 కోట్లుగా ఉంది.

ఇండెక్స్‌టాప్ నివేదికల ప్రకారం, అక్షయ్, ట్వింకిల్ ఖన్నా అపార్ట్‌మెంట్ చదరపు అడుగు ధర రూ. 1.17 లక్షలు. వర్లీలోని లగ్జరీ రెసిడెన్షియల్ టవర్‌లో రెండు టవర్లు ఉన్నాయి, వీటిలో ప్రతి ఒక్కటి 4 BHK, 5 BHK అపార్ట్మెంట్స్ ఉంటాయి. షాహిద్ కపూర్, అభిషేక్ బచ్చన్ వంటి ఇతర బాలీవుడ్ నటులు కూడా అదే ప్రాజెక్ట్‌లో లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను కలిగి ఉన్నారు. షాహిద్ కపూర్ అతని భార్య మీరా కపూర్ అపార్ట్‌మెంట్‌ను గత ఏడాది మేలో దాదాపు 60 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. వారి అపార్ట్మెంట్ 5,395 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇక అక్షయ్ కుమార్ చివరిగా వార్ డ్రామా స్కై ఫోర్స్‌ సినిమాలో కనిపించారు.

Next Story