బాలీవుడ్ స్టార్ న‌టుడు అక్ష‌య్ కుమార్‌కు క‌రోనా

Akshay kumar tests covid 19 positive.తాజాగా బాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ అక్ష‌య్‌కుమార్ కరోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 April 2021 4:37 AM
Akshay kumar got corona

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ కార‌ణంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక బీటౌన్‌లో క‌రోనా క‌ల‌కం సృష్టిస్తోంది. తాజాగా బాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ అక్ష‌య్‌కుమార్ కరోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఈ హీరో హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో అభిమానులకు తెలియ‌జేశారు.



'ఈ ఉద‌యం నాకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు పాటిస్తూ పాజిటివ్ అని తెలిసిన వెంట‌నే స్వీయ నిర్భంధంలోకి వెళ్లాను. వైద్యుల సూచ‌న‌లు పాటిస్తూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. ద‌య‌చేసి ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నాను. త్వ‌ర‌లోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వ‌స్తా' అని అక్ష‌య్ కుమార్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ 'రామ్‌ సేత' షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అభిషేక్‌ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్‌లో అలియాభట్‌, మిలింద్‌, ఆర్‌ మాధవన్‌, అమీర్‌ఖాన్‌, రణబీర్‌ కపూర్‌, కరిక్‌ ఆర్యన్‌, రోహిత్‌ సరఫ్‌, సిద్ధాంత్‌ చతుర్వేది, మనోజ్‌ బాజ్‌పేయి, రణ్‌వీర్‌ షోరే, మ్యూజిక్‌ డైరెక్టర్‌ బప్పిలహరి లు క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.


Next Story