అంద‌రి ముందే క‌న్నీరు పెట్టుకున్న స్టార్ హీరో

Akshay Kumar Cries After Hearing Sister Alka's Message.బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ఎమోష‌న‌ల్ అయ్యారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2022 8:08 AM IST
అంద‌రి ముందే క‌న్నీరు పెట్టుకున్న స్టార్ హీరో

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఓ రియాల్టీ షోలో పాల్గొన ఆయ‌న త‌న కుటుంబం గురించి చెబుతూ భావోద్వేగానికి గురైయ్యారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ నేప‌థ్యంలో అక్షయ్‌ కుమార్ న‌టించిన చిత్రం 'ర‌క్షాబంధ‌న్‌'. ప్ర‌పంచ వ్యాప్తంగా రాఖీ పండుగ సంద‌ర్భంగా ఆగ‌స్టు 11న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా 'సూప‌ర్ స్టార్ సింగ‌ర్‌-2' ప్రోగ్రామ్‌లో అక్ష‌య్ కుమార్ పాల్గొన్నాడు. రాఖీ స్పెషల్‌ ఎపిసోడ్ కావడంతో రక్షా బంధన్ సినిమాని ప్రమోట్‌ చేసేందుకు వెళ్లాడు.

ఆ ప్రొగ్రామ్‌లో అక్షయ్‌ కుమార్‌ సోదరి అల్కా భాటియా రాఖీ కట్టే ఫొటోలను వీడియోగా చేసి చూపించారు. దీంతో పాటు అల్కా భాటియా ఓ ఆడియో మెసేజ్ పంపింది. దీన్ని వింటూ అక్షయ్‌ భావోద్వేగానికి గురయ్యాడు.

'మంచి, చెడు, అన్ని వేళ‌లా నువ్వు నా పక్క‌నే ఉన్నావు. సోద‌రుడిగానే కాకుండా స్నేహితుడు, తండ్రిగా ఉండి, న‌న్ను అనుక్ష‌ణం సంర‌క్షిస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు..'అంటూ అక్ష‌య్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. దీని వింటూ అక్ష‌య్ బావోద్వేగానికి గురైయ్యాడు. స్టేజీపైనే క‌న్నీరు పెట్టుకున్నాడు. తన సోదరి గురించి మాట్లాడుతూ..'మేము అప్పటి వరకు ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్లం. ఆ దేవత వచ్చిన తర్వాత మా జీవితాలు మారిపోయాయి. అన్నా చెల్లెళ్ల బంధం కన్నా మరే బంధం గొప్పది కాదు' అని అక్ష‌య్ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story