ఆకట్టుకుంటున్న 'సీతారామం' సుమంత్‌ ఫస్ట్ లుక్‌

Akkineni sumanth first look poster released from Seetharamam movie. దుల్క‌ర్ సల్మాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న 'సీతారామం'లో హీరో అక్కినేని సుమంత్ కీల‌క‌పాత్ర పోషిస్తున్నాడు.

By అంజి  Published on  9 July 2022 4:30 PM IST
ఆకట్టుకుంటున్న సీతారామం సుమంత్‌ ఫస్ట్ లుక్‌

దుల్క‌ర్ సల్మాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న 'సీతారామం'లో హీరో అక్కినేని సుమంత్ కీల‌క‌పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్లు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాలో సుమంత్‌ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను వీడియా ద్వారా చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఈ మూవీలో బ్రిగేడియర్ విష్‌ణు శర్మ పాత్రలో సుమంత్ నటిస్తున్నాడు. ఆర్మీ అధికారిగా కొత్త లుక్‌లో సుమంత్ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాడు. 'కొన్ని యుద్ధాలు మొదలు పెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ముగింపు కాదు' అని సుమంత్‌ చెప్పే డైలాగ్‌ చాలా బాగుంది. ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీలో దుల్కర్ సల్మాన్‌ లెఫ్టినెంట్‌ రామ్‌, బాలీవుడ్‌ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ సీత పాత్రల్లో కనిపించనున్నారు. ముస్లిం యువతి అఫ్రీన్ పాత్రలో రష్మిక నటిస్తోంది. అందాల రాక్షసి, పడిపడి లేచె మనసు సినిమాలకు దర్శకత్వం వహించిన యువ దర్శకుడు హను రాఘవపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. 196 పీరియాడిక్ లవ్‌ స్టోరీ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వప్న మూవీస్, వైజయంతి మూవీస్ బ్యానర్‌లపై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూరుస్తుండగా పీఎస్ వినోద్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు.


Next Story