క‌న్నీళ్లు పెట్టుకున్న నాగార్జున‌.. వీడియో వైర‌ల్‌

Akkineni Nagarjuna gets emotional after Watching Oke oka Jeevitham movie.అక్కినేని నాగార్జున భావోద్వేగానికి గురైయ్యాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Sept 2022 11:38 AM IST
క‌న్నీళ్లు పెట్టుకున్న నాగార్జున‌.. వీడియో వైర‌ల్‌

కింగ్ అక్కినేని నాగార్జున భావోద్వేగానికి గురైయ్యాడు. యువ హీరో శ‌ర్వానంద్‌, రీతూ వ‌ర్మ జంటగా న‌టించిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. అక్కినేని అమ‌ల ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది. శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

ఈ నేప‌థ్యంలో టాలీవుడ్‌లోని సినీ ప్ర‌ముఖుల కోసం బుధ‌వారం ఈ చిత్ర ప్రీమియ‌ర్ ప్ర‌ద‌ర్శించారు. ఈ సినిమా చూసిన అనంత‌రం నాగార్జున మాట్లాడుతూ.. ఒకే ఒక జీవితం భావోద్వేగ‌భ‌రిత‌మైన చిత్రం అని చెప్పారు. "సినిమా బాగుంది. త‌ల్లి సెంటిమెంట్ నేప‌థ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఎవ‌రైనా చూస్తే క‌న్నీళ్లు పెట్టుకుంటారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు క‌న్నీళ్లు ఆగలేవు. మా అమ్మ‌, ఆమె చూపించిన ప్రేమ గుర్తుకు వ‌చ్చింది" అని నాగార్జున అన్నారు. ఈ సినిమా ఘ‌న విజ‌యాన్ని సాధించాల‌ని నాగార్జున ఆకాంక్షించారు.

అక్కినేని అఖిల్ సైతం భావోద్వేగానికి లోన‌య్యాడు. "సినిమా ప్రివ్యూ కి అమ్మ కూడా రావటం నాకు చాలా విలువైనది. ఇవాళ నేను ఇలా ఉండటానికి కారణం కేవలం మా అమ్మ మాత్రమే. ఆమెకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను" అని అమ‌ల అన్నారు. ఈ చిత్రంలో శ‌ర్వానంద్‌, అమ‌ల త‌ల్లీకొడుకులుగా న‌టించారు. 'క‌ణం' పేరుతో త‌మిళంలో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Next Story