అమీర్‌ఖాన్‌ చిత్రంలో అక్కినేని హీరో

Akkineni Nagachaitanya to play role in Aamir Khan movie. అమిర్ ఖాన్ ప్రస్తుతం 'లాల్ సింగ్ చద్దా' అనే సినిమాలో నాగ‌చైత‌న్య న‌టిస్తున్నాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jan 2021 3:46 PM IST
Akkineni Nagachaitanya to play role in Aamir Khan movie

అక్కినేని వార‌సుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నాగ‌చైత‌న్య.. విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ స‌క్సెస్‌ల‌తో దూసుకెలుతున్నాడు. ఇదిలా ఉంటే.. త‌న భార్య స‌మంత బాట‌లో చైతు ప‌య‌నించ‌నున్నాడా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రైన స‌మంత ఇటీవ‌ల 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇక చైతన్య కూడా అతి త్వ‌రలో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌నున్నాడ‌ట‌.

అదికూడా బాలీవుడ్ మిస్ట‌ర్ పర్ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్న అమీర్‌ఖాన్ చిత్రంతో ఎంట్రీ ఇవ్వ‌నున్నాడ‌ట‌. అమిర్ ఖాన్ ప్రస్తుతం 'లాల్ సింగ్ చద్దా' అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఇందులోని సపోర్టింగ్ పాత్ర కోసం మొదటగా తమిళ నటుడు విజయ్ సేతుపతిని ఓకే చేశారట. కానీ డేట్స్ కారణంగా విజయ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దాంతో ఈ సినిమా మేకర్స్ ఈ పాత్ర చేసేవారి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. చివరకు ఈ పాత్రకు నాగచైతన్యను అనుకున్నారట. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే చిత్ర‌బృందం చైత‌న్య‌ను సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. కాగా.. దీనిపై చైతు ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని.. త్వ‌ర‌లోనే ఓ నిర్ణ‌యం తీసుకోనున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య 'థ్యాంక్యూ' చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.




Next Story