'కస్టడీ' టీజర్‌ రిలీజ్‌.. అదిరిన చైతూ యాక్షన్‌ సీక్వెన్స్‌

నాగచైతన్య నటించిన లేటెస్ట్‌ మూవీ 'కస్టడీ'. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా.. ఈ సినిమా టీజర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.

By అంజి  Published on  16 March 2023 9:00 PM IST
Akkineni Nagachaitanya, custody movie

'కస్టడీ' టీజర్‌ రిలీజ్‌.. అదిరిన చైతూ యాక్షన్‌ సీక్వెన్స్‌

అక్కినేని యంగ్‌ హీరో నాగచైతన్య నటించిన లేటెస్ట్‌ మూవీ 'కస్టడీ'. ఈ సినిమాలో నాగచైతన్య కానిస్టేబుల్‌ పాత్రలో నటిస్తున్నారు. మే 12వ తేదీన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా.. ఈ సినిమా టీజర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. తమిళ్‌ డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు ఈ సినిమా డైరెక్ట్‌ చేశారు. నాగచైతన్య సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. 'బంగార్రాజు' సినిమా తర్వాత ఇద్దరి ఈ కాంబో వస్తున్న మూవీ ఇది. ఈ సినిమాపై చైతూ అభిమానులు భారీ ఎక్స్‌పెక్టెషన్స్‌ పెట్టుకున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్‌లుక్‌, గ్లింప్స్‌ మూవీ లవర్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వాటికి మించేలా టీజర్‌ ఉంది. అభిమానులు ఊహించినట్లే ఓ రేంజ్‌లో 'కస్టడీ' టీజర్‌ కట్‌ చేశారు. ఈ టీజర్‌ మూవీపై అంచనాలు పెంచుతోంది. 88 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్‌లో నాగచైతన ఇంటెన్స్‌లుక్‌లో కనిపించారు. పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌తో ఇరగదీశారు.

"గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అది ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది. ఒక యుద్ధానికి. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో. ఎప్పుడు వస్తుందో. ఎలా వస్తుందో నాకు తెలియదు. తెలుసుకోవాలనీ లేదు. ఎందుకంటే నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం" అంటూ నాగ చైతన్య వాయిస్​తో టీజర్‌ మొదలైంది. టీజర్‌లో నాగచైతన్య ఫైట్స్‌ సీన్స్‌తో దుమ్మలేపారు. చివరకు "నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. ఎస్.. దట్ ట్రూట్ ఈజ్ ఇన్ మై కస్టడీ" అనే డైలాగుతో టీజర్ ముగిసింది.

ఈ సినిమాలో అరవింద్ స్వామి, శరత్ కుమార్​లు ప్రతినాయకులుగా కనిపించనున్నారు. ఈ మూవీపైనే నాగచైతన్య భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు.


Next Story