'క‌స్ట‌డీ'లో నాగ‌చైత‌న్య‌

Akkineni Hero Naga Chaitanya In Custody.ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య ఓ చిత్రంలో న‌టిస్తున్నారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Nov 2022 11:33 AM IST
క‌స్ట‌డీలో నాగ‌చైత‌న్య‌

త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగ చైత‌న్య ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. చైతు కెరీర్‌లో 22వ చిత్రంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. నేడు(న‌వంబ‌ర్ 23) నాగ‌చైత‌న్య పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్టు లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి 'క‌స్ట‌డీ' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ చిత్రంలో చైతు పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు.

పోస్ట‌ర్‌లో తోటి అధికారులే నాగ చైత‌న్య‌ను బంధించారు. అంతేనా క‌దిలితే కాల్చేస్తామ‌ని అన్న‌ట్లుగా తుపాకులు గురి పెట్టారు. ఓ పోలీస్ ఆఫీస‌ర్‌కు అలాంటి ప‌రిస్థితి ఎందుకు ఎదురైంది తెలియాలంటే ఈ చిత్రం విడుద‌ల అయ్యేంత వ‌ర‌కు వెయ‌ట్ చేయ‌క త‌ప్ప‌దు. అర‌వింద్ స్వామి విల‌న్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో చైతు స‌ర‌స‌న కృతి శెట్టి న‌టిస్తోంది. ప్రియ‌మ‌ణి, శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని చిట్టూరి నిర్మిస్తున్నారు. యువ శంక‌ర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

Next Story