ముఖం పై గాయాల‌తో క‌నిపిస్తున్న అఖిల్‌.. ఫోటోలు వైర‌ల్‌

Akkineni Akhil latest photos from Agent movie goes viral.అక్కినేని వార‌సుడు అఖిల్ కొంత‌కాలంగా ఓ బ్లాక్ బాస్ట‌ర్ హిట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 May 2022 6:28 AM GMT
ముఖం పై గాయాల‌తో క‌నిపిస్తున్న అఖిల్‌.. ఫోటోలు వైర‌ల్‌

అక్కినేని వార‌సుడు అఖిల్ కొంత‌కాలంగా ఓ బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' కాస్త ఊర‌ట‌నిచ్చింది. ఈ చిత్రంలో ల‌వ‌ర్ బాయ్‌గా అఖిల్ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. అయితే.. అత‌డు కోరుకున్న క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ను ఇవ్వ‌లేక‌పోయింది. ఈ క్ర‌మంలో ఈ సారి ఎలాగైనా బ్లాక్ బాస్ట‌ర్ కొట్టాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు అఖిల్‌. ఈ క్ర‌మంలో సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో 'ఏజెంట్ 'చిత్రంలో న‌టిస్తున్నాడు.

ఈ చిత్రం కోసం అఖిల్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్నాడు. త‌న మేకోవ‌ర్‌ను పూర్తిగా మార్చేశాడు. సిక్స్ ప్యాక్ బాడీతో హాలీవుడ్ హీరోల‌ను త‌ల‌ద‌న్నేలా మారిపోయాడు. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్‌గా క‌నిపించ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ మ‌నాలీలో జ‌రుగుతోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోల‌ను అఖిల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నాడు.

మొహం నిండా గాయాల‌తో ఉన్న ఈ ఫోటోల‌ను చూస్తుంటే భారీ యాక్ష‌న్ స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో సాక్షీ వైద్య క‌థానాయిక‌. ఏకే ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి సురేంద‌ర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఆగ‌స్టు 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ చిత్రం.

Next Story
Share it