అఖిల్ ఏజెంట్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Akkineni Akhil Agent Movie releasing on 12 August 2022.అక్కినేని అఖిల్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2022 7:24 PM IST
అఖిల్ ఏజెంట్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

అక్కినేని అఖిల్ న‌టిస్తున్న తాజా చిత్రం 'ఏజెంట్'. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ స‌ర‌స‌న సాక్షి వైద్య న‌టిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 12న‌ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం కాసేప‌టి క్రితం వెల్ల‌డించింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ల‌వ‌ర్ బాయ్‌గా క‌నిపించిన అనిల్ తొలిసారి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో అల‌రించేందుకు సిద్దం అయ్యాడు. ఈ చిత్రం కోసం అఖిల్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. సిక్స్ ప్యాక్‌తో అఖిల్ మేకోవ‌ర్ చూసిన అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అక్కినేని నాగ చైత‌న్య న‌టిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' బాలీవుడ్ మూవీ ఆగ‌స్టు 11న విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఆమీర్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో నాగ చైత‌న్య ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అయితే.. ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తారా..? లేదా..? అన్న‌ది ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story