అఖిల్ 'ఏజెంట్'.. బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.!

Akkineni Akhil Agent Movie Business. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన సినిమా 'ఏజెంట్'. ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తీశారు

By Medi Samrat  Published on  26 April 2023 9:00 PM IST
అఖిల్ ఏజెంట్.. బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.!

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన సినిమా 'ఏజెంట్'. ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తీశారు. రిచ్ విజువల్స్.. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో సినిమాను రూపొందించారు. ఈ సినిమా హిట్ కోసం అక్కినేని అభిమానులే కాకుండా.. యాక్షన్ సినిమా అభిమానులు కూడా ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఏజెంట్ ప్రీ రిలీజ్ బిజినెస్ 36.20 కోట్లు జరిగిందని అంటున్నారు. అఖిల్ గత సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కంటే రెట్టింపు ఈ బిజినెస్. నైజాంలో 10కోట్లు, సీడెడ్: 4.50కోట్లు, ఆంధ్ర: 14.80కోట్లు, ఏపీ తెలంగాణ కలిపి: 29.30కోట్లు కాగా.. కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో 3.80Cr, ఓవర్సీస్ లో 3.10 కోట్లు మొత్తంగా చూస్తే టోటల్ వరల్డ్ వైడ్ 36.20కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా బరిలోకి దిగుతోంది.

డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్ ను.. ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. సురేందర్ 2 సినిమా బ్యానర్ తో ఇందులో నిర్మాణ భాగస్వామిగా దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఈ మూవీ నిర్మాణంలో భాగమయ్యారు. ఏప్రిల్ 28న థియేటర్లలోకి రాబోతోంది ఈ సినిమా.


Next Story