అఖిల్ బ‌ర్త్‌డే.. స్ట‌న్నింగ్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్

Akhil Akkineni Agent first look released.అఖిల్ న‌టించిన 'ఏజెంట్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2021 10:26 AM IST
Agent first look

అక్కినేని మూడో త‌రం వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. త్వ‌ర‌లో అఖిల్ న‌టించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్' చిత్రం విడుద‌ల కానుంది. బొమ్మ‌రిల్లు బాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంపై అఖిల్ భారీ ఆశ‌లే పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ ఓ చిత్రంలో న‌టించ‌నున్నాడు అనే వార్త వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అఖిల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా.. తాజాగా దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.

అఖిల్ - సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి 'ఏజెంట్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌లో అఖిల్‌ను చూసిన ఫ్యాన్స్ షాక్‌కు గుర‌య్యారు. ఎప్పుడూ ల‌వ‌ర్ భాయ్‌గా క‌నిపించే అఖిల్‌.. పెరిగిన జుత్తు, రఫ్ గడ్డం, చేతిలో సిగరెట్ తో అఖిల్ ఫుల్ యాటిట్యూడ్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ లో కనిపించడం విశేషం. ఈ స్పై థ్రిల్లర్ మూవీతో సాక్షి వైద్య హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 11 నుండి మొదలు కానుంది.

వక్కంతం వంశీ కథను అందిస్తున్న ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మంతో కలిసి దర్శకుడు సురేందర్ రెడ్డి 'సురేందర్ 2 సినిమా' బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కాంబినేషన్ లో 'కిక్, రేసు గుర్రం' వంటి సూపర్ హిట్స్ రావడంతో ఇప్పుడీ ప్రాజెక్ట్ పైన విప‌రీతంగా అంచ‌నాలు పెరిగాయి. విశేషం ఏమంటే.. సినిమా షూటింగ్ మొదలు కాకముందే... దీని రిలీజ్ డేట్ ను ప్రొడ్యూసర్స్ లాక్ చేశారు. ఈ యేడాది డిసెంబర్ 24న తమ 'ఏజెంట్' జనం ముందుకు వస్తాడని ప్రకటించారు.‌


Next Story