బాల‌య్య అభిమానుల‌కు పండ‌గే.. "అఖండ" టైటిల్ సాంగ్ టీజర్ వ‌చ్చేసింది

Akhanda Title Song Promo released.నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న తాజా చిత్రం అఖండ‌. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Nov 2021 6:53 AM GMT
బాల‌య్య అభిమానుల‌కు పండ‌గే.. అఖండ టైటిల్ సాంగ్ టీజర్ వ‌చ్చేసింది

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న తాజా చిత్రం 'అఖండ‌'. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న ప్ర‌గ్యాజైస్వాల్ న‌టిస్తోంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో బాల‌య్య ఎన్న‌డూ క‌నిపించ‌ని భిన్నమైన పాత్ర‌లో క‌నిపిస్తుండ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ప్రస్తుతం షూటింగ్ పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా.. దీపావళి కానుకగా చిత్ర‌బృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. 'అఖండ' చిత్ర టైటిల్ సాంగ్ ప్రోమోను విడుద‌ల చేశారు. 'భమ్‌.. అఖండ' అంటూ ఈ టైటిల్ సాంగ్ సాగుతోంది. పూర్తి పాట కోసం ఈ నెల 8వ తేదీ వ‌ర‌కు ఆగ‌క‌త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ ప్రోమో యూ ట్యూబ్‌లో దూసుకుపోతుంది.

Next Story
Share it