ట్రెండింగ్ లో బాలయ్య 'అఖండ'..

Akhanda movie teaser in Trending.బాలయ్య 'అఖండ' సినిమా టీజర్ అలా వచ్చి రాగానే వైరల్ అయిపోయింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 April 2021 8:01 AM GMT
Akhanda teaser

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం 'అఖండ‌'. భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, టీజ‌ర్‌ను ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. నందమూరి బాలకృష్ణ డిఫరెంట్ గెటప్ తో రౌద్రంగా అదిరిపోయే డైలాగ్స్ చెపుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా బాలయ్య సినిమా టీజర్ అలా వచ్చి రాగానే వైరల్ అయిపోయింది. వ్యూస్ తో పాటు లైక్స్ కూడా భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి.

విడుదలైన కొన్ని గంటల్లోనే దాదాపు 8 మిలియన్ వ్యూస్ సాధించింది 'అఖండ' టీజర్. ప్రస్తుతం యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. జగపతి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మే 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Next Story