రికార్డుల‌ పోస్ట‌ర్ల త‌డి ఆర‌క ముందే.. ఆ రికార్డులను తిరగరాసే వాడే బాలయ్య

Akhanda Movie Teaser Crosses 51Millon Views.నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న చిత్రం 'అఖండ‌' టీజ‌ర్ విడుద‌లై రెండు వారాలు కూడా కాకముందే.. 51 మిలియ‌న్స్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 April 2021 11:52 AM IST
Akhanda

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న చిత్రం 'అఖండ‌'. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌తున్న ఈ చిత్రంలో ప్ర‌గ్యా జైస్వాల్‌, పూర్ణ హీరోయిన్లులుగా న‌టిస్తున్నారు. ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా.. బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో గ‌తంలో వ‌చ్చిన 'సింహా', 'లెజెండ్ 'చిత్రాలు ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించాయో అంద‌రికి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూడో చిత్రం కావ‌డంతో.. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. టీజ‌ర్ విడుద‌లై రెండు వారాలు కూడా కాకముందే.. 51 మిలియ‌న్స్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. బాల‌య్య త‌నదైన శైలిలో చెప్పిన డైలాగ్స్‌, ఆయ‌న గెట‌ప్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. టీజ‌ర్ హ‌వాతో సినిమాకు ట్రేడ్ వ‌ర్గాల‌లో మంచి డిమాండ్ ఏర్ప‌డింది. బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మేలో విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. క‌రోనా వ‌ల‌న ఈ మూవీ వాయిదా ప‌డే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి.

51 మిలియ‌న్ వ్యూస్‌ని దాటిన సంద‌ర్భంగా ద్వార‌క క్రియేష‌న్స్ ఓ ట్వీట్ చేసింది. 'అప్పట్లో ఒక నానుడి ఉండేది. రికార్డు పోస్ట‌ర్ల‌ తడి ఆరక ముందే.. ఆ రికార్డులను తిరగరాసే వాడు బాలయ్య అని .. అది మ‌రోసారి నిరూపించాడు 'అని ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


Next Story