వినాయ‌క చ‌వితి కానుక‌గా 'అఖండ‌'..!

Akhanda movie release date fix.నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న తాజా చిత్రం అఖండ‌. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2021 8:02 AM GMT
వినాయ‌క చ‌వితి కానుక‌గా అఖండ‌..!

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న తాజా చిత్రం 'అఖండ‌'. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ చిత్ర మెజారిటీ షూటింగ్ పూర్తి అయ్యింది. క‌రోనా సెకండ‌వ్ వేవ్ కార‌ణంగా చిత్ర షూటింగ్ వాయిదా ప‌డింది. అయితే.. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతుండ‌డంతో ఈ చిత్ర షూటింగ్ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఉగాది సంద‌ర్భంగా విడుద‌లైన 'అఖండ' టైటిల్ పోస్ట‌ర్‌తో పాటు టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అంతేకాదు.. టాలీవుడ్‌లో అతి త‌క్కువ స‌మ‌యంలో 50మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసిన టీజ‌ర్‌గా స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

ఇదిలా ఉంటే.. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈచిత్ర విడుద‌ల విష‌యంలో ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌ని చిత్ర‌బృందం బావిస్తోన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వినాయ‌క చ‌తుర్థి కానుక‌గా అంటే సెప్టెంబ‌ర్ 10న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌బోతున్నార‌ట నిర్మాత‌లు. మిర్యాల ర‌వీంద‌ర్ నిర్మిస్తున్న ఈచిత్రంలో బాలయ్య స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్ న‌టిస్తోంది. బాల‌కృష్ణ ద్విపాత్రాభినయంతో అల‌రించ‌నుండ‌గా.. శ్రీకాంత్, పూర్ణ కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు.

Next Story
Share it