అఫీషియల్ : అఖండ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్‌

Akhanda Movie OTT Release Date fix.నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన చిత్రం అఖండ‌. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2022 10:14 AM IST
అఫీషియల్ : అఖండ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్‌

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన చిత్రం 'అఖండ‌'. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం 2021 డిసెంబ‌ర్ 21 విడుద‌లైన ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. క‌రోనా కాలంలోనూ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ఇక ఇప్పుడు డిజిట‌ల్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ద‌మైంది. అఖండ చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుద‌ల కానుంది. సంక్రాంతి త‌రువాత జ‌న‌వ‌రి 21 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు డిస్నీ+ హాట్‌స్టార్ వెల్ల‌డించింది.

'2022 జనవరి 21న అఖండ ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుందని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి అంటూ ట్వీట్ 'చేసింది.

ఇదిలా ఉంటే.. అల్లుఅర్జున్ న‌టించిన 'పుష్ప' చిత్రం జ‌న‌వ‌రి 7 నుంచి అమెజాన్ ఫ్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. వాస్త‌వానికి' అఖండ' చిత్రం విడుద‌లైన ప‌దిహేను రోజుల‌కు విడుద‌లైన 'పుష్ప 'చిత్రం.. 'అఖండ' చిత్రం కంటే ముందుగా ఓటీటీలోకి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

Next Story