'అఖండ' ఓటీటీ విడుద‌ల ఎప్పుడంటే..?

Akhanda Movie OTT Release Date Fix.న‌ట‌సింహం నందమూరి బాల‌కృష్ణ న‌టించిన చిత్రం అఖండ‌. బోయ‌పాటి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Dec 2021 4:07 PM IST
అఖండ ఓటీటీ విడుద‌ల ఎప్పుడంటే..?

న‌ట‌సింహం నందమూరి బాల‌కృష్ణ న‌టించిన చిత్రం 'అఖండ‌'. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్ న‌టించింది. డిసెంబ‌ర్ 2న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. బాల‌య్య డైలాగ్‌లు, బోయ‌పాటి శ్రీను టేకింగ్‌, థ‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోవ‌డంతో బాక్సీఫీసు వ‌ద్ద వ‌సూళ్ల‌తో దూసుకుపోతుంది. కేవ‌లం వారం రోజుల వ్య‌వ‌ధిలోనే రూ.85 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సంబంధించిన మ‌రో క్రేజీ అప్‌డేట్ ప్ర‌స్తుతం ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల కానుంది. ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం డిస్నీ ఫ్ల‌స్ హాట్ స్టార్ ఈ చిత్ర హ‌క్కుల‌ను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. సినిమా విడుద‌లైన 30 రోజుల త‌రువాత‌నే స్ట్రీమింగ్ చేయాల‌ని అప్పుడే అగ్రిమెంట్‌లో పొందుప‌రిచార‌ట‌. దీంతో కొత్త సంవ‌త్స‌రం(2022) కానుక‌గా ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల కానుంద‌ట‌. జ‌న‌వ‌రి 1, 2022న డిస్నీ హాట్‌స్టార్ లో అఖండ స్ట్రీమింగ్ కానుంద‌ట‌. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్రక‌ట‌న రానున్న‌ట్లు స‌మాచారం.

ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో విల‌న్‌గా శ్రీకాంత్ న‌టించారు. క‌రోనా కార‌ణంగా సినిమా థియేట‌ర్‌కి ప్రేక్ష‌కులు వ‌స్తారా..? రారా..? అన్న అనుమానాల‌ను అఖండ చిత్రం ప‌టా పంచ‌లు చేసింది. అఖండ చిత్ర ఘ‌న విజ‌యం ప్ర‌స్తుతం సినీ వ‌ర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Next Story