ఈ వారం ఓటీటీలో మాస్ జాతరే
Akhanda and Shyam Singha Roy up for OTT release.కరోనా మహమ్మారి కారణంగా ఈ సారి సంక్రాంతి కాస్త తప్పినట్లు అయింది
By తోట వంశీ కుమార్ Published on 19 Jan 2022 11:49 AM ISTకరోనా మహమ్మారి కారణంగా ఈ సారి సంక్రాంతి కాస్త కళ తప్పినట్లు అయింది. పెద్ద సినిమాల విడుదల వాయిదా పడగా.. చిన్న సినిమాలు క్యూ కట్టాయి. ఇక ఈ వారం కూడా కొన్ని చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అటు ధియేటర్లతో పాటు ఇటు ఓటీటీలోనూ ఈ వారం విడుదల అయ్యే సినిమాలపై ఓ లుక్కేద్దాం.
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖండ' చిత్రం గతేడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. విడుదలై 50 రోజులకు చేరువవుతున్నప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. కాగా.. ఈ చిత్రం జనవరి 21న డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే థియేటర్లలో దుమ్మురేపిన ఈ చిత్రం ఇక ఓటీటీల్లో తన సత్తా చూపించేందుకు సిద్దమైంది.
అఖండ చిత్రం తరువాత ఈ వారం ఓటీటీలో అలరించేందుకు వస్తున్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక జనవరి 21న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
'ది పప్పట్ మాస్టర్' , 'టూ హాట్ టు హ్యాండిల్' సీజన్ 3, 'ది రాయల్ ట్రీట్ మెంట్', హిస్టారికల్ థ్రిల్లర్ 'మునిచ్ ది ఎడ్జ్ ఆఫ్ వార్', 'ఓజార్క్' సీజన్ 4, 'సమ్మర్ హీట్', 'హౌ ఐ మెట్ యువర్ ఫాదర్', 'బిలియన్స్' సీజన్ 6, 'అన్ పాజడ్ నయా సఫర్', 'ఎ హీరో', 'భూతకాలమ్', 'లూజర్ సీజన్ 2', 'ముదాల్ నీ ముదివమ్ నీ' వంటి వెబ్ సిరీస్‌లు, చిత్రాలు ఈ వారం ఓటీటీలు స్ట్రీమింగ్ కానున్నాయి.
ఇక థియేటర్లలో 'వర్మ'.. వీడు తేడా, 'ఉనికి', 'వధు కట్నం' వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అయ్యాయి.