Ajith Kumar : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం
తమిళ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అజిత్ తండ్రి సుబ్రమణ్యం కన్నుమూశారు
By తోట వంశీ కుమార్ Published on
24 March 2023 4:44 AM GMT

తల్లిందండ్రులతో అజిత్‌కుమార్
తమిళ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అజిత్ తండ్రి సుబ్రమణ్యం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని నివాసంలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. తండ్రి మృతితో అజిత్ ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలిసిన అభిమానులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు. సుబ్రమణ్యం అంత్యక్రియలను సాయంత్రం బెసెంట్ నెగర్ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.
పి సుబ్రమణ్యం కేరళలోని పాలక్కాడ్‌కు చెందినవాడు. అతనికి భార్య మోహిని, ముగ్గురు పిల్లలు అనుప్ కుమార్, అజిత్ కుమార్, అనిల్ కుమార్ సంతానం.
ఇటీవల అజిత్ కుమార్ తన కుటుంబసభ్యులతో కలిసి యూరప్ వెకేషన్‌కు వెళ్లారు. తండ్రి మరణవార్త విని వెంటనే చెన్నైకి పయనం అయ్యారు.
Next Story